Breaking NewscrimeHome Page SliderTelanganatelangana,

జిహెచ్ఎంసి బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్ హేయం

జిహెచ్ఎంసి పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమ‌ని మాజీ మంత్రులు కేటిఆర్‌,హ‌రీష్ రావులు ఖండించారు.గురువారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా? అని నిల‌దీశారు. గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా, మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా? అని ధ్వ‌జ‌మెత్తారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జిహెచ్ఎంసి అసమర్థ తీరును ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు.అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే, ప్రజాక్షేత్రంలో గుణపాఠం