Andhra PradeshHome Page Slider

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 17న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈసారి బడ్జెట్ 2లక్షల 60 వేల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల ముందు ప్రవేశ పెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. నాలుగేళ్ల పాలన మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమిట్ ముఖ్య మైన అంశాలతో ఎజెండా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి .. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటారు.