జగన్మాతకు గవర్నరు దంపతుల ప్రత్యేక పూజలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇం ద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల తొలిరోజు ఆదివారం బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న జగన్మాత దుర్గమ్మను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు వారికి ఆశీర్వచనం చేశారు. ట్రస్టు బోర్డు ఛైర్మన్ రాంబాబు, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఈఓ రామారావు, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.