IPL వేళ ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్
స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన ఆటతో,వ్యక్తిత్వంతో దేశవ్యాప్తంగా ఎన్నో లక్షలమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం దేశంలో ధోని అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులంతా IPL మ్యాచ్‌లను వీక్షించడంలో బిజీగా ఉన్నారు. అయితే ధోని ఈ IPL సీజన్‌లో CSK టీమ్‌కు సారథిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్‌కు మరో తీపి కబురు అందింది. అదేంటంటే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సినిమాల రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ..మహేంద్ర సింగ్ ధోని జీవితంపై తెరకెక్కిన MS ధోని ది అన్‌టోల్డ్ స్టోరీని రీరిలిజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాలో అచ్చం ధోనిలాగా నటించి అందరిని బాగా మెప్పించారు. దీంతో 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. కాగా ఈ సినిమాను మే 12 న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ధోని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

