Home Page SliderNational

పూజా హెగ్డే హీరోయిన్‌గా చేయబోతున్న ‘కాంచన 4’…

Share with

హీరో, డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తీయబోతున్న సినిమా ‘కాంచన 4’ మూవీలో పూజా హెగ్డే నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా కాంచన సిరీస్‌లో ఇప్పటికే ముని, కాంచన 2, గంగా సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం తెరకెక్కబోయే కాంచన 4 సినిమాను రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో గోల్డ్ మైన్ మూవీస్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.