ఎమ్మెల్యేలకు లంచం ఆరోపణలు..కేజ్రీవాల్‌పై ఏసీబీ దర్యాప్తు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు అలా అయ్యాయో లేదో, ఇలా ప్రధాన పార్టీలు పరస్పర ఆరోపణలతో మండిపడుతున్నాయి. రేపు ఎన్నికల ఫలితాలు ప్రకటించనుండడంతో నేడు ఆప్, బీజేపీ పార్టీలు విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే బీజేపీ పార్టీ తమ ఎమ్మెల్యేలకు లంచం ఆఫర్ చేస్తోందని, పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని ఆశపెడుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అలాగే ఫేక్ ఎగ్జిట్ పోల్స్‌తో కూడా తమ నేతలను భయపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ఖండించిన బీజేపీ ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. తమ పార్టీపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణ చేయించాలని కోరారు. దీనితో గవర్నర్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు పార్టీ అధినేత కేజ్రీవాల్, సీనియర్ నేత సంజయ్ సింగ్ తదితరుల నివాసాలకు చేరుకున్నారు.

