నేడు బీఆర్ఎస్ అగ్రనేతల కీలక భేటి
తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.దీంతో రాష్ట్రంలోని పార్టీలన్ని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్,హరీష్ రావులతో సీఎం కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ఎన్నికలకు ముందే పార్టీలోని నేతలను బుజ్జగించడం,మేనిఫెస్టోపై తుది కసరత్తు ,పెండింగ్ నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం వంటి కీలక అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్,హరీశ్ రావులతో చర్చించనున్నారు. అంతేకాకుండా ఎలక్షన్స్ ఇన్ఛార్జ్లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.