InternationalNews

లంకను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్

దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్‌ క్రికెట్ టోర్నీలో ఆప్ఘనిస్తాన్ విజృంభించింది. ఫజుల్లా ఫరూకీ అద్భుత ప్రదర్శనతో లంకపై పిల్లకూన ఆఫ్ఘన్ సంచలన విజయం నమోదు చేసుకొంది. ఆప్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ ఫజుల్లా ఫరూకీ 3 వికెట్లు తీయడంతో శ్రీలంక… ఆప్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆప్ఘన్… శ్రీలంకను 105 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇక లంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఆప్ఘన్ ఓపెనర్లు భారీ శుభారంభంతో అదరగొట్టేశారు. 10.1 ఒక్క ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి భారీ విజయాన్ని అందుకొంది. అద్భుత ప్రదర్శిన చూపించిన ఫజుల్లా ఫరూకీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు.