స్టార్ క్రికెటర్‌గా మారిన స్వీపర్
ప్రస్తుతం IPL-16 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. కాగా నిన్న జరిగిన KKR Vs GI మ్యాచ్‌లో రింకూ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రస్తుతం రింకూ సింగ్ పేరు దేశమంతా మార్మోగిపోతుంది. ఎందుకంటే నిన్న రింకూ ఆడిన ఆటతీరు అలాంటిది మరి. నిన్నటి మ్యాచ్‌లో వరుస 4,6లతో రింకూ చెలరేగిపోయాడు. రింకూ తన ప్రత్యర్థి జట్టు గుజరాత్ టైటన్స్‌కు గట్టిపోటి ఇచ్చాడు. కాగా నిన్నటి మ్యాచ్‌లో 21 బంతుల్లో 48 పరుగులు చేసి తన జట్టు KKR ను గెలిపించాడు. కానీ క్రికెట్‌లోకి వచ్చే క్రమంలో అతడి ప్రయాణం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. అయితే రింకూ యూపీలోని నిరుపేద కుటుంబానికి చెందినవాడు. కాగా అతను ఒకప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక స్వీపర్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది.

