Home Page SliderTelangana

మల్కాజిగిరి నుంచి బరిలో అల్లుడుకి ఛాన్స్

మైనంపల్లి హన్మంతరావు పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో క్లారిటీకి వచ్చింది. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి నియోజకవర్గం టికెట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా మర్రి రాజశేఖర్‌రెడ్డి కొనసాగుతున్నారు.