National

పన్నీర్‌కు రొంబ కష్టమొచ్చింది…

Share with

తమిళనాడులో అన్నాడిఎంకే పార్టీలో ఏక నాయకత్వ వ్యవహారంపై పన్నీరు సెల్వం (ఓపీఎస్) కు పళనిస్వామికి (ఈపీఎస్) మధ్య జరుగుతున్న వివాదానికి నేడు తెరపడేలా హైకోర్టు సంచలన తీర్పు విడుదల చేసింది. సర్వసభ్య సమావేశం నిర్వహించవద్దని… పన్నీరు సెల్వం వర్గం మద్రాస్ హైకోర్టును కోరింది. ఐతే కోర్టు అందుకే ససేమిరా అంది. ఈపీఎస్ వర్గం నేతృత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించాలని న్యాయస్ధానం తీర్పునిచ్చింది. జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీయంకే పార్టీకి పన్నీరు సెల్వం సమన్వయకర్తగా … పళనిస్వామి సంయుక్త సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ద్వంద నాయకత్వంలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉందని…… అందుకు పరిష్కారం కోసం సర్వసభ్య సమావేశం జరపాలని నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించి చర్చించారు.

చర్చల్లో భాగంగా పళనిస్వామి మద్దతుదారులు ఏక నాయకత్వ వ్యవహారాన్ని ఆ సమావేశంలో తెరపైకి తెచ్చారు. దీంతో పార్టీలో వ్యతిరేకతలు నెలకొన్నాయి. గత నెల 23న సర్వసభ్య సభను నిర్వహించారు. పార్టీ సభ్యుల వాదనలు పరీక్షించిన హైకోర్టు తీర్పును ఈ నెల 11కు వాయిదా వేసింది. ఫలితంగా సోమవారం ఉదయం హైకోర్టు సభ నిర్వహించేంచుకు అనుమతిస్తూ…. సర్వసభ్య సభ బాధ్యతలు ఈపీఎస్ వర్గానికి అప్పగించింది. తీర్పు వచ్చిన కొద్ది సేపటిక్రితమే ఈపీఎస్ సర్వసభ్య సభ సమావేశాన్నిప్రారంభించారు. ఈ సమావేశంలో పళనిస్వామి వర్గం మద్దతుదారులు ద్వంద నాయకత్వం రద్దు చేస్తూ… ప్రధాన నాయకత్వ పదవికి పళనిని ఎన్నుకునేందుకు లైన్ క్లియర్ చేశారు. సవరణ తీర్మానానికి ఆమోదముద్రవేశారు. కొత్తగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించారు. కో-ఆర్డీనేటర్,జాయింట్ కో-ఆర్డీనేటర్ పదవులను తొలగించారు. అదే విధంగా పళని వర్గం తీసుకొచ్టిన 16 తీర్మానాలను ఆమోదించారు. అంతకముందు సర్వసభ్య సభకు వ్యతీరేఖంగా పన్నీరు సెల్వం మద్దతుదారులకు…..పళనిస్వామి
మద్దతుదారుల మధ్య కొట్లాట జరిగింది. ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద144 సెక్షన్ విధించారు.