BusinessHome Page SliderNational

యూపీఐ ఛార్జీల బాదుడికి గ్రీన్ సిగ్నల్

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్), రూపే డెబిట్ కార్డుల ద్వారా అధిక మొత్తంలో లావాదేవీలు చేస్తున్నవారికి మర్చంట్ ఫీజుల రూపంలో ఛార్జీలు వడ్డించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం వీటిపై అదనపు ఛార్జీలు లేవు. అయితే వార్షిక ఆదాయం రూ.40 లక్షల పైన ఉన్న వ్యాపారుల యూపీఐ చెల్లింపుల మీద మర్చెంట్ డిస్కౌంట్ రేట్‌ను మళ్లీ తీసుకురావాలని బ్యాంకింగ్ ప్రతినిధులు కోరడంతో కేంద్రం సానుకూలంగా స్పందించింది. కరోనా సమయంలో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి 2022 బడ్జెట్‌లో ఈ ఛార్జీలను తొలగించారు. ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో జరిగిన సమావేశంలో ఫిన్‌టెక్ అధికారులు డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ అంశాన్ని లేవనెత్తారు. దీనితో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.