ఉపరాష్ట్రపతికి అస్వస్థత
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఛాతీ నొప్పి, అసౌకర్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. 73 ఏళ్ల ధన్ ఖడ్ ను ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించారు. ధన్ ఖడ్ కు ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పరిశీలనలో ఉన్నారని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.ఉపరాష్ట్రపతి ఆస్పత్రిలో చేరడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. వెంటనే అవసరమైన సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

