పార్టీ శ్రేణులపై కేసీఆర్ అసహనం..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కీలక సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ భవన్ కు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే.. కేసీఆర్ చేరుకున్న సమయంలో కేడర్ లో తోపులాట చోటు చేసుకుంది. దీంతో పార్టీ శ్రేణులపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. సీఎం.. సీఎం.. అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు చేశారు. కేసీఆర్ కి చిర్రెత్తి ఒర్లకండిరా బాబు.. దండం పెడతానంటూ కేసీఆర్ పార్టీ శ్రేణులపై సీరియస్ అయ్యారు.

