Home Page SliderNationalTrending Today

వారికి యూపీ సీఎం యోగి హెచ్చరికలు

Share with

మహా కుంభమేళా జరుగుతున్న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఇప్పటి వరకూ 56.25 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారని యూపీ సీఎం యోగి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుంభమేళాపై, పవిత్ర స్నానాలపై అనుచిత ప్రచారాలు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే వారికి తగిన శిక్ష తప్పదన్నారు. కుంభమేళాకు వచ్చిన భక్తుల కారణంగా విసర్జితాలు నదీజలాలలో కలిసాయనే ఆరోపణలు తిప్పికొట్టారు. నది నీరు తాగేందుకు కూడా అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే అది భారతీయుల మనోభావాలతో ఆడుకున్నట్లేనన్నారు. భారత దేశ ప్రజలు సనాతన ధర్మం పాటిస్తారని,  గంగామాతను ఎంతో పవిత్రంగా భావిస్తారని పేర్కొన్నారు. ఈ కుంభమేళాను ఒక పార్టీయో, సంఘమో నిర్వహించడం లేదని, ప్రభుత్వమే ఒక సేవకుడిగా బాధ్యతలు చేపట్టిందన్నారు. కుంభమేళా తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలలో మరణించినవారికి సంతాపం తెలియజేశారు.