Breaking NewscrimeHome Page SliderTelangana

ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకుని ఆత్మ‌హ‌త్య‌

కుటుంబ క‌లహాల నేప‌థ్యంలో ఓ వివాహిత ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న మియాపూర్‌లో జ‌రిగింది.పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు ఏలూరు జిల్లా చాట్రాయి మండలానికి చెందిన నాగ‌ల‌క్ష్మీ అనే యువతి హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఉద్యోగం చేస్తోంది.ఐదు నెలల క్రితం అదే జిల్లా ముసునూరు మండలం తోచిలుకకు చెందిన మ‌నోజ్‌తో వివాహం అయింది.అత‌ను హైద్రాబాద్‌లో కాంట్రాక్ట‌ర్ గా ప‌నిచేస్తున్నాడు.ఇద్ద‌రూ క‌లిసి మియాపూర్‌లోని గోకుల్‌ప్లాట్స్‌లో నివాసం ఉంటున్నారు.ఇద్ద‌రి మ‌ధ్య గ‌త కొద్ది రోజుల నుంచి విభేదాలు పొడ‌సూపాయి.దీంతో భ‌ర్త వేధింపులు భ‌రించ‌లేక ఆన్‌లైన్ లో విష‌యం ఆర్డ‌ర్ చేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.