మృతి చెందిన విద్యార్థికి ఉద్యోగం-తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం
ఉన్నత కొలువే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటూ మృత్యువాత పడ్డ ఆ యువకుడు బుధవారం రాత్రి ప్రకటించిన పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో విజేత అయిన వైనం..
టేకులపల్లి: ఉన్నత కొలువే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటూ మృత్యువాత పడ్డ ఆ యువకుడు బుధవారం రాత్రి ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో విజేతగా నిలిచాడు. కొడుకు విజయాన్ని తలుచుకుని దూరమైన ఆతని జ్ఞాపకాలను నెమరువేసుకొని గుండెలు పగిలేలా ఏడ్చిన తల్లిదండ్రులు. టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పాత తండాకు చెందిన భూక్య ప్రేమ్‌కుమార్ – పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు ప్రవీణ్ (22) బీటెక్ కంప్లీట్ చేశాడు. కానిస్టేబుల్ పరీక్షలు రాసిన అనంతరం సివిల్స్ సాధన కోసం శిక్షణ నిమిత్తం ఢిల్లీ వెళ్లాడు. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని నాలుగు రోజులు సెలవులు రావడంతో ఖమ్మంలో తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చాడు. ఆగస్టు 17న ఫ్రెండ్‌తో కలిసి నగరంలో ఓ ఫ్లెక్సీని కడుతున్న సమయంలో యాక్సిడెంటల్‌గా 11 కేవీ విద్యుత్ వైర్ తగిలి షాక్‌కు గురై మృతి చెందాడు. తాజాగా వచ్చిన రిజల్ట్స్‌లో ప్రవీణ్ ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించడం విశేషం.