crimeHome Page SliderNational

సైబర్ క్రైమ్ బారి నుండి ఇలా రక్షించుకోండి..

మన చేతిలో స్మార్ట్ ఫోన్ ద్వారానే సైబర్ నేరస్తులు మనల్ని మోసం చేస్తారు. అందుకే ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని చిరునామా, లొకేషన్, ఫోన్, ఆధార్, పాన్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎవరికీ చెప్పవద్దని పేర్కొన్నారు. ఏవైనా అనుమానిత ఫోన్లు వచ్చినప్పుడు ఫోన్ కట్ చేసి, ఆందోళన చెందకుండా నెంబరును బ్లాక్ చేయమని సలహా ఇచ్చారు. ఏదైనా ప్యాకేజ్ వస్తుందని, 1 నొక్కమని, ట్రాయ్ మీ ఫోన్ డిస్కనెక్ట్ చేస్తోందని చెప్తే అది స్కామ్ కాల్ అని ఏ మాత్రం స్పందించవద్దని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టు, ప్యాకేజిలో డ్రగ్స్ ఉన్నాయని చెపితే, ఏ మాత్రం స్పందించవద్దని, సైబర్ క్రైమ్ పోలీసులకు 1930 నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయమని చెప్పారు. అలాగే, మెసేజ్‌లకు, వాట్సాప్‌లకు స్పందించవద్దన్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ సైబర్ క్రైమ్ బారిన పడకుండా కాపాడుకోండని హెచ్చరించారు.