home page sliderHome Page SliderNational

బాయ్ కాట్ ఢిల్లీ క్యాపిటల్స్..

ఐపీఎల్ పున: ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ వివాదాల్లోకి పడింది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను జట్టు లోకి తీసుకున్నందుకు ఆ జట్టు భారీ ట్రోలింగ్ ను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడిని జట్టులోకి ఎలా తీసుకుంటారని భారత అభిమానులు డీసీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ లో బంగ్లాదేశ్ పాక్ కు అండగా నిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ ముస్తాఫిజుర్ ఎంపికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్తాఫిజుర్ ఎంపిక సిగ్గు చేటు చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా #BoycottDelhi Capitals ట్రెండింగ్ లో ఉంది. భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ (ఆస్ట్రేలియా) ఐపీఎల్ టోర్నికి తిరిగి రానని స్పష్టం చేశాడు. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా డీసీ యాజమాన్యం ముస్తాఫిజుర్ ను ఎంపిక చేసుకుంది. ఈ మేరకు రూ. 6 కోట్ల భారీ మొత్తం చెల్లించి ఒప్పందం చేసుకుంది.