ఆడపిల్లల రక్షణపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను ప్రభుత్వం మాత్రమే అరికట్టాలంటే సాధ్యం కాదని, ప్రతీ ఆడపిల్లకూ రక్షణ కల్పించడం ఆచరణలో సాధ్యం కానిపని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరులోని అరణ్య భవన్‌లో అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆడపిల్లలపై జరిగే నేరాల గురించి ప్రశ్నించగా ఇలా బదులిచ్చారు. ఎన్ని చట్టాలు తెచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ధి ఉండాలని, కళ్లెదుట జరుగుతున్న నేరాలపై ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినులు, మహిళలు ఆత్మరక్షణ విద్యను నేర్చుకుని తమపై దాడులు చేసే వారికి బుద్ది చెప్పాలన్నారు.

