Andhra PradeshHome Page SliderNewsSpiritual

‘అందుకే ఒప్పుకుంటున్నా’..బ్రహ్మశ్రీ చాగంటి

రాష్ట్రప్రభుత్వం నైతిక సలహాదారుగా అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి తాను సంతోషంగా ఒప్పుకుంటున్నట్లు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వెల్లడించారు. పిల్లల్లో, యువతలో నైతిక విలువలు పెంపొందించే బాధ్యతను నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నానని కానీ, కేవలం పదవుల కోసం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా యువతకు నాలుగు మంచిమాటలు చెప్పగలిగితే తనకు అంతకన్నా సంతోషం ఏముందని వ్యాఖ్యానించారు. పిల్లల అభిరుచులు తల్లిదండ్రులు, గురువులే గ్రహించి వారిని ప్రోత్సహించాలని, అప్పుడే వారు ఆ రంగాలలో బాగా రాణిస్తారని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడుచుకుంటే వారికి, వారి ద్వారా దేశానికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. బాలలు, విద్యార్థులు, నిగ్రహం, సంయమనం పాటించడం అలవర్చుకోవాలని హితవు చెప్పారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అభిరుచి ఏదైనా నైతిక విలువలు పాటిస్తూ జీవితంలో సాగేలా యువతను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.