భారత్ టీమ్‌కు ఒలింపిక్ స్పాన్సర్‌గా అదానీ కంపెనీ
2024లో పారిస్‌లో ఒలింపిక్స్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలలో భారత్ ఆటగాళ్లకు ప్రధాన స్పాన్సర్‌గా అదానీ కంపెనీ వ్యవహరించబోతోందని స్వయంగా సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. భారత్‌లో అతి పెద్ద కంపెనీ అయిన అదానీ గ్రూప్ స్పాన్సర్‌గా వ్యవహరించడంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి, #DeshkaGeetAtOlympics అనే పేరుతో వీడియోను కూడా సిద్ధం చేశారు. దీనిలో భారత్‌కు చెందిన ప్రతిభావంతులైన అథ్లెట్లు వర్కవుట్లు చేస్తున్న వీడియోలు ఉన్నాయి. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది భారత క్రీడాకారుల బృందం పాల్గొనగా, పారిస్ ఒలింపిక్స్ కోసం 113 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 26 నుండి పారిస్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహణకు సర్వం సిద్ధమయ్యింది.

