Home Page SliderNational

రాబోయే దసరా పండుగకు విశ్వంభర టీజర్…

చిరంజీవి నటిస్తున్న‘విశ్వంభర’ సినిమాపై ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ విషయం మీకు తెలిసిందే. ఓ దైవిక కార్యం తలపెట్టడానికి ఈ భూమిపై అడుగుపెట్టిన కారణజన్ముడికి, విశ్వంభర అనే లోకానికి మధ్య ఉండే సంబంధం, కార్యసాధనలో తను చేసే ప్రయాణం నేపథ్యంలో ఆద్యంతం సాహసం, సంభ్రమం కలబోతగా దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకుబోయే ప్రయత్నమే ఈ చిత్రమౌతుందని, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానాకర్షణగా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన అనేక ఫొటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో టీజర్‌ ఎప్పుడొస్తుందా అని సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్‌ 12న దసరా పర్వదినం సందర్భంగా టీజర్‌ను రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో ప్రేక్షకులకు విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేస్తారని చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.