సక్సెస్ దిశగా కార్తీకేయ2
నిఖిల్ , అనుపమ జోడీగా వచ్చిన కార్తీకేయ2 చిత్రం సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ నడుస్తోంది. కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మెత్తం 12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా , మూడు రోజుల్లోనే 15.44 కోట్ల షేర్ కలెక్ట్ చేసి లాభాల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటి వరకు హీరో నిఖిల్ కేరీర్‌లో అత్యధిక కలెక్షన్‌లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
మెదటి ప్రదర్శన నుండి ఈ చిత్రానికి వస్తున్న స్పందన నిజంగా అద్భుతమని , పటిష్టమైన కథ , ఆకర్షణీయమైన కథనం మాత్రమే కాకుండా విజువల్స్ , నేపథ్య సంగీతం ప్రశంసలు అందుకుంటున్నాయని నిర్మాతలు తెలిపారు.