Home Page SliderTelangana

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో బ్యారేజ్ ఫెయిల్యూర్

మేడిగడ్డ బ్యారేజీ ఘటన మరువక ముందే అన్నారం బ్యారేజీలో డ్యామేజ్ మొదలైంది. 18, 19, 20, 40 గేట్ల వద్ద పైపింగ్ సమస్య మొదలైంది. బ్యారేజ్ బేస్మెంట్ కింది నుండి నీళ్లు లీక్ అవుతున్నట్టు తెలుస్తోంది. సమస్య పెరిగితే అన్నారం బ్యారేజ్ సైతం సింక్ అయ్యే ప్రమాదం తప్పదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 66 గేట్లతో 1.2 కి.మీ పొడవుతో నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజ్ నిర్మించారు. బ్యారేజ్ వద్దకు వెళ్లకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం వ్యవహారంపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.