ఉద్యోగులకు జగన్ సర్కార్ జీతాలు ఇవ్వడం లేదా?
జీతాలు ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం
: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా దివాల తీసిందని ఈనెల ఇప్పటికే 13 రోజులు గడిచిన కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని గతంలో ఎన్నడు ఇలాంటిది జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం పై పార్టీ నేతలతో ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓటమి భయం వేన్నాడుతోందని ఎప్పుడు ఎన్నికల వచ్చినా వైసీపీ ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం కు అనూహ్య స్పందన వస్తుందని అన్ని వర్గాల ప్రజలు తమ తమ సమస్యలపై బయటికి వచ్చి చర్చిస్తున్నారని పేర్కొన్నారు. రివర్స్ పాలన వల్ల రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం మంచి స్పందన వస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రోజురోజుకీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతుందన్న అంశం ముఖ్యమంత్రికి అర్థమైందని అందుకే ముందస్తు ఎన్నికలకు ఆలోచనలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా భయపెట్టి కొంతమేరకు ఆపగలిగారని ఇప్పుడు ఇదేం క
ఖర్మ కార్యక్రమంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అన్నారు. ప్రజలు నిర్భయంగా బయటికి వచ్చి సమస్యలపై గల మేత్తుతున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో దాదాపు 12 లక్షల ఇళ్లు నిర్మిస్తే ప్రస్తుతం మూడున్నర ఏళ్లలో వైసీపీ కేవలం 5 ఇల్లు మాత్రమే కట్టిన విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి చర్చ జరిగేలా చూడాలని చంద్రబాబు నేతలకు సూచించారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ వెనుకబడటానికి ప్రధాన కారణం వైసీపీ విధానాలేనని విమర్శించారు. ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు మరింత ఉధృతం చేయాలని నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

