రాజధాని అమరావతేనన్న సజ్జల
ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మూడు రాజధానులపై చట్టాన్ని ఇప్పటికే ఉపసంహరించుకున్నామన్నారు. లేని కేసు మీద హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందన్నారు. న్యాయ ప్రక్రియకు, రాజ్యాంగానికి లోబడి మూడు రాజధానులు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేందుకు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజధాని రైతులు కూడా అభివృద్ధి చెందుతారన్నారు. 40 ఏళ్లలో అయ్యే అభివృద్ధిని మూడేళ్లలో చేస్తామని టీడీపీ చూపించిందంటూ విమర్శించారు సజ్జల. 29 గ్రామాలకు సంబంధించిన అన్ని రకాల అభివృద్ధి చేసితీరతామన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై టీడీపీ ఇంత వరకు మాట్లాడలేదన్నారు. అమరావతి రాజధానిపై మీడియా సంస్థలు రాజకీయం చేస్తున్నాయన్నారు సజ్జల.

