ఏపీ అభివృద్ధిలో కేంద్రం నిర్ణయాత్మకపాత్ర-ప్రధాని మోదీ
ప్రియమైన సోదరి సోదరిమణులారా నమస్కారమంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మోదీ నమస్కారం చెప్పారు. కొన్ని రోజుల ముందు అల్లూరి సీతారామరాజు 125వ జన్మదిన వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించిందని అది తనకు ఎంతో గర్వకారణమన్నారు. ఆంధ్ర భూమిపైకి మరోసారి కాలు పెట్టే అవకాశం వచ్చిందన్నారు. ఇవాళ విశాఖకు గొప్ప రోజన్నారు. విశాఖ ఏపీకి తలమానికమైనదన్నారు. ప్రత్యేకమైన నగరమని.. వ్యాపారం సమృద్ధిగా జరుగుతుందన్నారు. వేల ఏళ్ల క్రితమే ఇక్కడ పోర్టు పశ్చిమాసియా, రోమ్ వరకు వ్యాపార కలాపాలు నెరిపిందన్నారు. భారతదేశానికి వ్యాపారంలో విశాఖ కేంద్ర బిందువయ్యిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విశాఖ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతున్నా.. పది వేల కోట్ల ప్రాజెక్టులో ఏపీ అభివృద్ధికి దోహదకారి అవుతాయన్నారు.

మౌలిక సదుపాయాలతో.. అభివృద్ధి కొత్త శిఖరాలు చేరుకుంటుందన్నారు మోదీ. వెంకయ్యనాయుడు, హరిబాబుకు ఈ సందర్భంగా వారిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఆంధ్ర పట్ల వెంకయ్యకు, హరిబాబుకు అంతులేని అభిమానం ఉందన్నారు. ప్రాజెక్టుల కోసం ఎప్పుడూ అడుగుతూనే ఉండేవారన్నారు మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. స్నేహంగా ఉంటారు. కలుపోగోలుగా ఉంటారన్నారు. అన్ని పనుల్లోనూ ఏపీ ప్రజలు ప్రతిభకనబర్చుతున్నారన్నారు. విద్యా, వ్యాపారం, టెక్నాలజీ, సాంకేతికరంగమైనా, మెడికల్ ప్రొఫెషన్, రంగం ఏదైనా.. ఏపీ వ్యక్తులు అద్భుత శిఖరాలను అధిరోహిస్తున్నారంటూ ఏపీ వాసులకు అభినందనలు తెలిపారు మోదీ.

వృత్తిపరమైన లక్షణాలతో కలిసిమెలిసి జీవించాలన్న సిద్ధాంతం ఏపీ ప్రజలకు గొప్ప వరమన్నారు. తెలుగు భాష ప్రజలు ఎప్పుడూ కూడా అందరి బాగు కోసం పనిచేస్తారన్నారు. అందరిని బాగు చేయడం కోసం కృషి చేస్తారన్నారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసే విషయంలో.. ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి కారణమవుతాయన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ ఆజాదీకా అమృత కాలంలో ఉన్నామని.. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నామన్నారు. అభివృద్ధి యాత్ర ఇది బహుముఖమైనదన్నారు. సామాన్యుడి అభివృద్ధి ఇందులో కీలకమన్నారు. కేంద్రం ఆలోచన అంతా సమ్మిళత అభివృద్ధి కోసమేనన్నారు. రైల్వేలు, రహదారులు, హైవేలను రెంటినీ అభిృవద్ధి చేస్తున్నామన్నారు. పోర్టులు, రహదారుల, రైల్వేల అభివృద్ధి విషయంలో సందేహాల్లేవన్నారు. మౌలికసదుపాయాలు కల్పించడకపోవడం వల్ల గతంలో ఇబ్బందులెదుర్కొన్నామని… ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.