NewsTelangana

ఈసీ క్లియరెన్స్‌తో రాజగోపాల్‌రెడ్డికి ఊరట

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి భారీ ఊరట దక్కింది. రాజగోపాల్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన ఫిర్యాదులను ఈసీ తిప్పికొట్టింది. టీఆర్‌ఎస్‌ చేసిన ఫిర్యాదులను ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఉప ఎన్నిక నేపథ్యంలో… సుమారు 5.24 కోట్ల బదిలీ జరిగిందని, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్‌ఎస్‌ పార్టీ, రాజగోపాల్‌రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.  టీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్‌ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. నగదు లావాదేవీలపై సోమవారంలోపు సమాధానం ఇవ్వాలని ఈసీ కోరింది. అయితే.. ఈసీ నోటీసులకు రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన ఎన్నికల కమీషన్‌… ఫిర్యాదులపై సరైన ఆధారాల్లేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.