జూపల్లి ఇంటికి కేటీఆర్
మంత్రి కేటీఆర్ ఇవాళ మాజీ ఎమ్మెల్యే జూపల్లి ఇంటికి వెళ్లడం కొత్త చర్చకు కారణమయ్యింది. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు జూపల్లి దూరంగా ఉంటున్నారు. జూపల్లి పార్టీ మారబోతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… కేటీఆర్ రాక.. రాజకీయాల్లో కాక రేపుతోంది. అదే సమయంలో కేటీఆర్ పర్యటనకు జూపల్లి దూరంగా ఉండడం… ఈ తరుణంలో కేటీఆర్, జూపల్లి ఇంటికి వెళ్లడంతో అసలేం జరుగుతోందనని పార్టీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయ్. జూపల్లికి, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి మధ్య విభేదాలు నడుస్తున్న నేపథ్యంలో.. జూపల్లి పార్టీ మారకుండా చేసేందుకు కేటీఆర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

