Home Page SliderNational

తమిళనాడు అరియలూర్‌లో భారీ బాణసంచా పేలుడు -పలువురు మృతి

Share with

తమిళనాడులోని అరియలూర్‌  జిల్లాలో బాణసంచా తయారీ  కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. కనీసం 9 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ జిల్లాలోని వెట్టియూర్ గ్రామంలో దేవస్థానంలోని పండుగల కోసం ఇక్కడ బాణాసంచా తయారు చేస్తున్నారు. నేటి ఉదయం 10 గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఈ ప్రదేశంలో భారీ పేలుడు సంభవించింది. గాయపడిన వారిని తంజావూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి 3 లక్షల రూపాయలు, తీవ్రగాయాల పాలైన వారికి లక్ష రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మంత్రులు, ప్రభుత్వాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.