Home Page SliderInternational

బంగ్లాదేశ్, ఢాకాలో పేలుడు 14 మంది మృతి

బంగ్లాదేశ్ రాజధానిలోని ఏడు అంతస్తుల భవనంలో జరిగిన శక్తివంతమైన పేలుడులో కనీసం 14 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఓల్డ్ ఢాకాలోని రద్దీగా ఉండే గులిస్తాన్ ప్రాంతంలో సాయంత్రం 4:50 గంటలకు పేలుడు సంభవించింది. ఘటన స్థలం వద్ద పద్నాలుగు మృతదేహాలను కనుగొన్నట్టు అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నందున సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. పేలుడుకు కారణం వెంటనే తెలియలేదు, కానీ స్థానిక నివాసితులు భవనం లోపల చట్టవిరుద్ధంగా నిల్వ చేసిన రసాయనాల వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే భూకంపం వచ్చిందేమోనని స్థానికులు భావించారు. చాలా మంది కాపాడాలంటూ అగ్నిమాపక సిబ్బందిని వేడుకుంటున్నారు. స్థానికులు క్షతగాత్రులను వ్యాన్‌లు, రిక్షాల్లో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న అలంగీర్ మాట్లాడుతూ, “పెద్ద శబ్దం రావడంతో, ప్రజలు భవనం నుండి త్వరగా బయటకు వచ్చారు. అందరి ముఖాల్లో భయాందోళనలు కన్పించాయన్నాడు. భవనం కిటికీల అద్దాలు పగిలి వీధిలో పడిపోయాయన్నాడు”.