వాహనాల దొంగ నుంచి 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం
వాహనాలను దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను పల్నాడు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పిడుగురాళ్లకు చెందిన పెరికల సాగర్ అనే వ్యక్తి పై జిల్లా వ్యాప్తంగా గతంలో అనేక కేసులు నమోదయ్యాయి.ఇతని కోసం పోలీసులు ఏడాది నుంచి విస్తృతంగా గాలిస్తున్నారు.చిక్కడు దొరకడు అన్న చందాన వాహనాలు కాజేసి పరారవ్వడంతో దొంగను పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. నాలుగు బృందాలుగా గాలించి సీసీ కెమెరాల ఆధారంగా అరెస్ట్ చేశారు.ఇతని నుంచి 11 బైకులు, 3 ఆటోలు స్వాదీనం చేసుకున్నారు.నిందితుణ్ణి డీఎస్పీ సమక్షంలో మీడియా ముందు హాజరు పరిచి వివరాలు తెలియజేశారు. కేసు ఛేదనలో కృషి చేసిన పోలీసు అధికారులు ,సిబ్బందిని ఈ సందర్భంగా డిఎస్పీ అభినందించారు.

