Breaking NewscrimeHome Page SliderInternationalNews Alert

100మందిని పొట్టనపెట్టుకున్నారు.. రెచ్చిపోయిన జిహాదీలు

జిహాదీలు మరోసారి మతోన్మాదంతో రెచ్చిపోయారు. పశ్చిమ ఆఫ్రికా బుర్కినా ఫాసోలో ఆల్‌ఖైదా అనుబంధ జిహాదీలు అన్యాయంగా దాడి చేసి నగరంలోని సైనికులతో పాటు కార్మికులు, స్థానికులతో సహా 100 మందిని పొట్టన పెట్టుకున్నారు. కీలకమైన సైనిక స్థావరంపై దాడులు చేశారు. ఒకేసారి 8 ప్రాంతాలలో దాడులు చేశారు. ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ జేఎన్‌ఐఎం అనే గ్రూప్ సాహెల్ ప్రాంతంలో ఆదివారం జరిగిన నరమేధానికి తామే కారణమని ప్రకటించుకుంది. 2022లో జరిగిన తిరుగుబాట్ల కారణంగా దేశంలోని సగభాగం కంటే ఎక్కువ ప్రాంతమే ఇలాంటి ఉగ్రవాద గ్రూపుల అధీనంలోకి వెళ్లిపోయింది.