Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో నేడు,రేపు అతిభారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో నేడు,రేపు అతిభారీ వర్షాలు -వాతావరణ శాఖ హెచ్చరిక

వర్షాకాలం భారీవర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల సంస్థ ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.  ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ రోజు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో విపత్తుల సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వివిధ జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా మీ ప్రాంతంలో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వమని, అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో   ఉన్న ఈ క్రింది  స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించగలరు.

•        1070

•        18004250101

•        08632377118