NewsTelangana

యూట్యూబ్‌లో లైక్స్ రావడం లేదని…

Share with

ఏంటో ఈ కాలం పిల్లలకు ఏమవుతుందో అసలే అర్థం కావడం లేదు.. ఎందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కావడం లేదు… యూట్యూబ్ పెట్టి… లైక్స్ రాలేదని… ట్రిబుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. తాను ఏర్పాటు గేమింగ్ యూట్యూబ్ చానెల్‌కు లైక్స్ రావడం లేదని అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడో విద్యార్థి. ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గ్వాలియర్ ట్రిబుల్ ఐటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న దీనా… ఇటీవలే పరీక్షలు రాసి ఇంట్లో ఉంటున్నాడు. యూట్యూబ్ చానెల్ ఎంతో కష్టపడి రూపొందించినా… లైక్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం యూట్యూబ్ లో తాను రుపొందించిన సెల్ఫ్ లో గేమ్ ఆడుతూ గురువారం తెల్లవారు జామున భవనం నుంచి దూకి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తాను ఒంటరివాడినన్న ఆందోళన తనను కుంగదీసిందని సుసైడ్ లెటర్ లో ప్రస్తావించాడు.