పోలీసుల అదుపులో VRA లు
డిమాండ్లను పరిష్కరించాలని గత నాలుగు రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టిన VRA లను అరెస్ట్ చేసిన పోలీసులు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిరాహార దీక్షలో భాగంగా 2020 అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా VRAలకు పే స్కేల్ అమలు చేయాలని 55 ఏళ్లు పైబడిన వారసులకు ఉద్యోగం కల్పించాలని , అర్హత కలిగిన వారికి ప్రమోషన్‌లు ఇవ్వాలని , VRA లకు రెండు పడక గదుల నిర్మాణ హామినీ నిలబెట్టుకోవాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రధాన డిమాండ్లతో రిలే దిక్షలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన VRA లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more; హైదరాబాద్ నకిలీ డాక్టర్.. రోగుల జీవితాలతో చెలగాటం