అత్యున్నతపీఠంపై గిరిజన బిడ్డ
దేశ అత్యుతన్నత స్థానంపై కొలువుదీరనున్నారు గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ముర్ము ఈనెల 25న ప్రమాస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనూహ్యంగా ముర్ము భారీ ఆధిక్యాన్ని పొందారు. ఏపీ, సిక్కిం, నాగాలాండ్‌లో వందకు వంద శాతం ఓట్లను ముర్ము రాబట్టుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము… యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో జయభేరి మోగించారు. ద్రౌపది ముర్ముకు మొత్తం ఓట్లలో 6,76,803 ఓట్లు రాగా… యశ్వంత్ సిన్హాకు 3,80,177 ఓట్లు వచ్చాయ్. మొత్తం 4,754 ఓట్లు పోలవగా… 4,701 ఓట్లు చెల్లాయ్. రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్… మొత్తం 4 రౌండ్లుగా సాగింది. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. రాష్ట్రపతిగా అతి పిన్న వయస్కురాలిగా, తొలి గిరిజన బిడ్డగా ముర్ము చరిత్ర సృష్టించారు.