Andhra PradeshHome Page Slider

కండక్టర్‌పై యువకుల దాడి

ఆర్టీసీ కండక్టర్ పై కొందరు యువకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. రాజంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కడపకు వెళ్తుండగా నందలూరు వద్ద ఆపి ఆన్ డ్యూటీలో ఉన్న కండక్టర్ పై యువకులు పిడిగుద్దులు కురిపించారు. కండక్టర్, బస్సు డ్రైవర్ ను దూషించారు. ఈ ఘటనపై ఆర్టీసీ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి వుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.