ప్లీనరీ అంతా కట్టు కథే అంటున్న..ట్రిపుల్ఆర్
కనుమురు రఘురామకృష్ణంరాజు పారిశ్రామిక వేత్త ,రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం నియోజకవర్గం నుండి వైసీపీ తరుపున లోక్ సభలో ఎంపీగా పనిచేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈ నెల 8,9వ తారీఖులలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాల గురించి ఈ రోజు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజసాయిరెడ్డి ప్లీనరీపై ముందు ఒక మాట తర్వత ఒక మాట మాట్లాడారన్నారు. ప్లీనరీ మొదటి రోజు 20 వేల మంది భోజనం చేశారని,రెండో రోజు 9 లక్షల మంది వచ్చారు అంటున్నారు అయితే బస్సుల్లో 15 మంది మించి కూడా లేరని 20 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆపితే ఎందుకు కనిపించలేదన్నారు. వాలంటీర్లు కూడా మన మనుషులే అని ముఖ్యమంత్రి సంభోదించడం సిగ్గు చేటన్నారు.కాకినాడ లాంటి ప్రాంతాల నుంచి 2 వేలు ఇచ్చి మరీ ప్రజలను సభకు తీసుకువచ్చారన్నారు. ప్లీనరీ కూడా అట్టర్ ప్లాప్ అయ్యందని తాను ముందే చెప్పానన్నారు.ప్లీనరీలో మూడే అంశాలు ఒకటి గోదావరి వంటలు,పేలనైన మంత్రుల ప్రసంగాలు మరియు జగన్ శాశ్వత అధ్యక్షుడు అని పెట్టుకోవడం ఇవి అన్ని కట్టు కథలే అని ఆయన ప్రస్థావించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా చేశారని కేంద్రానికి లేఖ
దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ శాశ్వత అధ్యక్షుడుగా జగన్ ప్రకటించుకున్నారని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు.
పీపుల్ యాక్ట్1951 ని ఉల్లంగించారని లేఖలో పేర్కొన్నారు.శాశ్వత అధ్యక్షుడి విధానం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని ఏదో భయంతోనే ఇలా చేశారన్నారు. ఐఏఎస్ అధికారులను సీఎం కార్యాలయానికి పిలిచి ఇబ్బందులకు గురి చేస్తూన్నారన్నారు. ఎల్వీ సుబ్రమణ్యం దీనిపై చక్కని ఇంటర్వూ ఇస్తూ కనీసం 20 మంది ఐఏఎస్‌లు మంచిగా పని చేస్తే బాగుండు అన్నారన్నారు. పయ్యావుల కేశవ్ కు సెక్యూరిటీ తీసేశారంటున్నారుకానీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తీయలేరు కాబట్టి సెక్యూరిటీని చేంజ్ చేసి క్రొత్త వాళ్ళను వేసి ఉంటారని అయిన క్రొత్తవాళ్ళను ఎందుకు వేశారో ఆలోచించాలన్నారు.వైఎస్ సునీత రెడ్డి తన తండ్రిని ఎవరు హత్యతెలుసుకోవాలని పోరాటం చేస్తుందని కావాలని కొందరు ఆమెపై పచ్చి అబద్దాలు వేస్తున్నారని ఆమె ఎప్పటికీ వైసీపీలో చేరరని చివరి వరకు పోరాటం చేస్తారని అన్నారు.రోహిత్ రెడ్డి ఒక కంపెనీ పెట్టి 1000 కోట్లు ఆర్జీంచారని తెలిసింది కాబట్టి… ఆయనకు విజయసాయి రెడ్డికి ఏంసంబంధం ఉందో చెప్పాలన్నారు. విజయసాయి రెడ్డి తండ్రికి యావజ్జీవ శిక్ష విధించారో లేదో చెప్పాలని పేర్కొన్నారు.
Read more :సినిమాలే ముద్దు… రాజకీయాలే వద్దు