పవన్‌కు వైసీపీ కౌంటర్..’తెలిస్తేనే మాట్లాడు’
ఏపీ వాలంటీర్ల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైసీపీ భగ్గుమంది. ‘వాలంటీర్లు వ్యవస్థలోనే లేరు, వారి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాం?’ అన్న పవన్ వ్యాఖ్యలకు ప్రభుత్వ జీవోలు ప్రదర్శిస్తూ కౌంటర్ ఇచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ, వారికి సంబంధించిన జీవోలు, వారి నియామక ఉత్తర్వులు, జీతాల ఉత్తర్వుల వివరాలను ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. జీవోలు సరిగ్గా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఎలా కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించింది. వాలంటీర్లకు సంబంధించినవి ఇన్ని జీవోలు ఉంటే సరిగ్గా తెలుసుకోకుండా మీ పరువు మీరే తీసుకుంటున్నారు అని ఎద్దేవా చేసింది.

