NewsTelangana

బీజేపీతో అమీతుమీ…

Share with

సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు పెట్టింది పేరనుకుంటారు.. కానీ ఇటీవల కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. మంచి, చెడులు బేరీజు వేసుకున్నాకే ఓ నిర్ణయానికి వస్తారు. విపక్షాల మద్దతు కోసం మమత బెనర్జీ సమావేశం నిర్వహించినా ఆ సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాలేదు. కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చే అభ్యర్థికి మద్దతివ్వబోమన్న వర్షన్ టీఆర్ఎస్ విన్పించింది. ఇప్పుడు విపక్ష అభ్యర్థికి సపోర్ట్‌గా గులాబీ పార్టీ మద్దతు కూడగట్టడం విశేషం.

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగం పేట ఎయిర్‌పోర్టులో యశ్వంత్ సిన్హాకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. మంత్రులు కేటీఆర్‌తోపాటు, టీఆర్ఎస్ ఎంపీలు ఆయనను రిసీవ్ చేసుకున్నారు. సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ నేతలు బేగంపేట, రాజ్ భవన్, ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహిస్తోంది.