InternationalNews

హలో మోదీ ఎలా ఉన్నారు.. మోడీకి బైడెన్ ఆత్మీయ స్పర్శ

Share with

జీ7 సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘట్టం చోటుచేసుకొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరికొకరు పరస్పరం అభివాదం చేసుకున్నారు. G7 నాయకుల సమావేశం సందర్భంగా గ్రూప్ పిక్చర్ కోసం పోజులిచ్చారు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో… అదే సమయంలో కెనడా ప్రధానితో మోడీ మాట్లాడుతున్న సమయంలో అక్కడకు వచ్చారు బైడెన్. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒక్కసారిగా ప్రధాని మోడీని వెనుక నుంచి వచ్చి హాయ్ చెప్పారు. ప్రధాని మోదీని వెన్నుతట్టి అభినందిస్తున్న వేళ… హలో బైడెన్ అంటూ మోదీ చేయికలిపారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత వరల్డ్ సిచ్యువేషన్ అంతా మారిపోతోంది. ఎవరికి తగిన విధంగా వారు డీల్స్ చేసుకుంటుంటే… ఇండియాకు మాత్రం ప్రపంచదేశాలు అనేక ఇబ్బందులు కలిగించాయ్. అయితే వాటిని వేటినీ పట్టించుకోకుండా ప్రధాని మోదీ… G7 శిఖరాగ్ర సదస్సులో… ఇండియా వినమ్రతను చాటారు. సదస్సులో పాల్గొనేందుకు మోదీ రెండ్రోజుల జర్మనీ టూరు‌కు వచ్చారు. జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్ ఆహ్వానంతో మోదీ ఈ సదస్సుకు హాజరయ్యారు. G7 దేశాల నాయకులతో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రధాని మోడీ ఈ సందర్భంగా చెప్పారు. గ్రీన్ గ్రోత్, క్లీన్ ఎనర్జీ, స్థిరమైన జీవనశైలి, ప్రపంచ శాంతి కోసం ఇండియా చేస్తున్న కార్యక్రమాలను మోదీ ఈ సందర్భంగా G7 దేశాలకు వివరించారు.