NationalNews

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా

Share with

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్న విపక్షాలకు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా దొరికారు. విపక్షాల ఐక్యత కోసం తృణముల్ కాంగ్రెస్ పార్టీకి తాను గుడ్ బై చెబుతున్నట్టు ట్వీట్ ద్వారా తెలిపారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని తృణముల్ ఇప్పటికే ఖరారు చేసింది. రాజీనామా లేఖను మమత బెనర్జీకి పంపించారు సిన్హా. టీఎంసీలో తగిన గుర్తింపు ఇచ్చినందుకు మమతకు యశ్వంత్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం తాను తృణముల్ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు రావాల్సి వస్తోందన్నారు. ఐతే… రాజీనామా లేఖను మమత ఆమోదిస్తారని ఆశిస్తున్నట్టు సిన్హా వెల్లడించారు. రాష్ట్రపతిగా ఎవరిని బరిలోకి దించాలన్నదానిపై విపక్షాలు కన్ఫ్యూజన్‌లో ఉన్నాయ్. ముందుగా జమ్ము, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఆ తర్వాత బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయబోమని తేల్చి చెప్పడం… విపక్షాలు అందిరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిపై పడింది. గోపాల కృష్ణ గాంధీ… తాను ఎన్నికల్లో నిలబడని చెప్పడంతో.. అందరి చూపు యశ్వంత్ సిన్హా వైపు పడింది. యశ్వంత్ సిన్హా 2018 నుంచి బీజేపీకి దూరంగా ఉన్నారు. 2021లో తృణముల్ కాంగ్రెస్‌లో చేరి సత్తా చాటారు. ఇవాళ శరద్ పవార్ నేతృత్వంలోని సమావేశానికి మమత బెనర్జీ డుమ్మా కొట్టనున్నారు. ఐతే తృణముల్ కాంగ్రెస్ తరపున తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సమవేశానికి మమత పంపిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయడానికి బీజేపీ పార్వమెంటరీ బోర్డు సమావేశ కానుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక జూన్ 15న ప్రారంభం కాగా… నామినేషన్ల దాఖలుకు తుది గడువు జూన్ 29. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరగనుంది.