‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు
తెలంగాణలో దేశీయ, విదేశీ పెట్టుబడులను భారీ స్థాయిలో ఆకర్షించే లక్ష్యంతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మొత్తం 13,500 ఎకరాల్లో ప్రపంచ ప్రమాణాలతో కూడిన జీరో కార్బన్ సిటీను నిర్మించబోతున్నాం. ఈ నగరంలో ఏర్పడే పరిశ్రమలు, కంపెనీలు కలిసి 13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి,” అని తెలిపారు.
అలాగే, సుమారు 9 లక్షల జనాభా నివసించేందుకు అనువుగా పెద్దఎత్తున నివాస నిర్మాణాలు జరగనున్నాయని చెప్పారు. డిజిటల్ వృద్ధిని దృష్టిలో ఉంచుకొని డేటా సెంటర్లకు 400 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.ఆధునిక ఆర్కిటెక్చర్, విస్తృతమైన అర్బన్ ఫారెస్టులు, పచ్చదనంతో కూడిన పర్యావరణ అనుకూల నగరంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొదిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

