ఐటీ ఫ్రషర్స్కు చుక్కలు చూపిస్తోన్న విప్రో.. ఆఫర్ల వెనుక మతలబు
ఒక ప్రోగ్రామ్ కింద ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్ల జీతాలను 50 శాతం తగ్గించాలన్న విప్రో చర్యపై ఉద్యోగుల సంఘం (NITES) నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్యాయం, ఆమోదించలేనిదని పేర్కొంది. తక్షణం నిర్ణయానికి విప్రో పునఃసమీక్షించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విప్రో అలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చని మార్కెట్ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే ఉద్యోగ సంఘాలు మాత్రం కస్సుమంటున్నాయి. బెంగళూరు ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న IT సర్వీసెస్ మేజర్, Wipro, ఇంతకుముందు సంవత్సరానికి ₹ 6.5 లక్షల (LPA) ఆఫర్‌ను అందించిన అభ్యర్థులను ఇటీవల సంప్రదించింది. వార్షిక పరిహారంగా ₹ 3.5 లక్షల ఇస్తామని చెప్పింది. విధుల్లో చేరతారో లేదో చెప్పాలంది. గత కొద్ది రోజులుగా అభ్యర్థులు ఆన్‌బోర్డ్ కోసం వేచి ఉన్నారని.. తాజా నిర్ణయంతో అశనిపాతంలా మారింది. విప్రో నిర్ణయం న్యాయ, పారదర్శకత సూత్రాలకు విరుద్ధంగా ఉందని NITES పేర్కొంది. యాజమాన్యం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాన్ని కనుగొనడానికి యూనియన్‌తో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్ చేసింది.

వెలాసిటీ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇటీవలి కమ్యూనికేషన్లో విప్రో ఇలా చెప్పింది. ఇతరుల మాదిరిగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, కస్టమర్ అవసరాలను అంచనా వేస్తూన్నామంది విప్రో. నియామక ప్రణాళికలు ఎంతో పారదర్శకంగా ఉంటాయంది. ఆన్ బోర్డింగ్ వచ్చే వారికి అభినందనలు చెబుతూనే… వారి జీతాల్లో కోత కోసింది. ప్రస్తుతం ₹ 3.5 లక్షల వార్షిక పరిహారంతో రిక్రూట్మెంట్ కోసం నిర్దిష్ట ప్రాజెక్ట్ ఇంజనీర్ పాత్రలు అందుబాటులో ఉన్నాయని… FY23 బ్యాచ్‌లోని మా వెలాసిటీ గ్రాడ్యుయేట్లందరికీ ఈ పాత్రలను ఎంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తామంది. ఈ సమస్యపై సంప్రదించినప్పుడు, విప్రో ఒక ఇమెయిల్ ప్రశ్నకు ప్రతిస్పందనగా ఇలా రెస్పాండ్ అయ్యింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార అవసరాల దృష్ట్యా, మేము మా ఆన్‌బోర్డింగ్ ప్లాన్లను సర్దుబాటు చేయాల్సి వచ్చిందంది. ఇప్పటి వరకు తాము ఇచ్చిన ఆఫర్‌ను తీసుకొని కెరీర్ ప్రారంభించడానికి, వచ్చే వారందరి నైపుణ్యాన్ని పెంపొందించడానికి, కొత్త అవకాశాలను అందిస్తామంది. విప్రో తన ఉద్యోగులందరి ఎదుగుదలకు, విజయానికి కట్టుబడి ఉన్నామంది.

ఐటి రంగ ఉద్యోగుల సంఘం NITES, నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్… విప్రో “అనైతిక చర్యను తీవ్రంగా ఖండించింది. సంవత్సరానికి 6.5 లక్షల ప్యాకేజీ నుండి సంవత్సరానికి 3.5 లక్షలకు త్గగించడాన్ని దారుణమంది. ముందస్తు సంప్రదింపులు, చర్చలు లేకుండా ఉద్యోగుల జీతాలను తగ్గించాలనే నిర్ణయం అన్యాయం మాత్రమే కాదు, న్యాయబద్ధత, పారదర్శకత సూత్రాలకు విరుద్ధమంది. సంస్థ ఆర్థిక ఇబ్బందుల భారాన్ని పూర్తిగా భుజాలపై మోపడం ఆమోదయోగ్యం కాదని NITES అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా అన్నారు. యాజమాన్యం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాన్ని కనుగొనడానికి యూనియన్‌తో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్ చేసింది.

