జపాన్ మాజీ ప్రధాని అంతిమయాత్రకు జన నీరాజనం

67 ఏళ్ళ షింజో గత శుక్రవారం నాడు నరా నగరంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యారు. షింజో అబేకు కడసారి నివాళి సమర్పించడానికి మంగళవారం నాడు వేలాది మంది ప్రజలు వీధుల్లోకి తరలి వస్తున్నారు. సమీప కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో టోక్యోలోని జోజోజి ఆలయం వద్ద షింజో అంత్యక్రియలు జరుగుతాయి. టోక్యో నగరం గుండా ఆయన అంతిమయాత్ర సాగిన తరువాత బౌద్ధ ఆచారాల ప్రకారం అంత్యక్రియలను నిర్వహిస్తారు..షింజో అంతిమయాత్రను చూసేందుకు ప్రజల వేల సంఖ్యలో వీధుల వెంబడి బారులు తీరారు.జపాన్‌కు అత్యంత సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్న షింజో ఒక పాలకుడిగా చెరిగిపోని ముద్ర వేశారు.
Read more: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ప్రస్ధానం