మెట్రో ఎడిటింగ్‌లో బాలకృష్ణ ఇంటిని లేపేస్తారా?
హైడ్రా విషయంలో ఎవరడ్డొచ్చినా బుల్డోజర్‌తో తొక్కుకుంటూ వెళ్తా బొమ్మాళీ అంటూ…కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వాహకుల వెంట పడ్డాడు సీఎం రేవంత్ . ఫ్లై ఓవర్లు,అండర్ పాస్‌లు,మెట్రో రూట్ ల కోసం ఎవరి ఇళ్లు అడ్డొచ్చినా కూలగొట్టుకుంటూ పోతా అంటున్నాడు.ఇందులో తమ ప్రభుత్వం మంత్రులు,ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు.ఇందులో భాగంగా ఉమ్మడి రాష్ట్ర మాజీ హోం మంత్రి జానా రెడ్డి ఇంటికి కూడా హైడ్రా అధికారులు శనివారం మార్కింగ్ వేశారు.దీంతో జానారెడ్డి సీఎం పై ఫైర్ అయ్యారు. రోడ్డు విస్తరణ పనుల కోసం నా ఇంటికే మార్కింగ్ వేస్తారా చూస్తా అందరి సంగతి అంటూ హెచ్చరిస్తున్నారు.తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని,అందులో ఇప్పుడున్న రేవంత్ ఒకరన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన ఇంటిని ఇవ్వనన్నారు.అదేవిధంగా బాలకృష్ణ ఇంటికి కూడా హైడ్రా అధికారులు మార్కింగ్ వేశారు. దీనిపై బాలకృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.దీంతో టెండర్ల దశలోనే వివాదాస్పదంగా మారడంతో.. ప్రభుత్వ యంత్రాంగానికి భూసేకరణ ప్రక్రియ పెద్ద సవాల్ గా మారింది.

