Home Page SliderInternational

ఈ నది ఆకుపచ్చగా ఎందుకు మారింది?

బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరం సావోపోలోలోని ఒక నది ఆకుపచ్చగా మారిపోయింది. అక్కడి కరువు పరిస్థితులు, తీవ్రమైన కాలుష్యం కారణంగా ఈ నది ఇలా మారిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. వర్షాలు కురవక పోవడంతో ఈ నదికి ఉపనదుల నుండి వచ్చే ప్రవాహాలు కలవక పోవడంతో ఈ నది ఇలా మారిపోయింది. బ్రెజిల్‌లోని 59 శాతం ప్రాంతం తీవ్ర కరువుతో అల్లాడుతోంది. ఇది యూఎస్‌లోని సగం కంటే ఎక్కువ. అమెజాన్ బేసిన్‌లోని నదులు కరువు కారణంగా చాలా తక్కువ నీటిని కలిగి ఉన్నాయి. పైగా ఇక్కడ తరచూ మానవ తప్పిదాల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు అటవీ ప్రాంతాన్ని ఎడారిలా మార్చేశాయి. ఇక్కడ వాతావరణంలో గాలిలో స్వచ్ఛత, నాణ్యత లోపించడం కూడా ప్రధానకారణంగా చెప్పవచ్చు. కాలుష్యం, పొగ కారణంగా సోమవారం సావోపోలో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన గాలి ఇక్కడ నమోదయ్యింది. ఈ ప్రాంతంలో 21 మిలియన్ల ప్రజలు నివాసం ఉంటున్నారు.