ఎందుకు ట్రంప్‌నే చంపాలనుకుంటున్నారు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?
ఇది రెండోస్సారి. మొన్న ట్రంప్‌కు గాయమైంది. చెవికి కొంచెం రక్తం కారింది. మళ్లీ ఇప్పుడు ట్రంప్ ఉన్న పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కలకలం రేగింది. గన్ షాట్ కాల్పులు జరిగినప్పటికీ, ఆయన సురక్షితంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన గల్ఫ్ కోర్స్ పరిసర ప్రాంతంలో పొదల్లో తాజాగా AK 47 లభించింది. డొనాల్డ్ ట్రంప్ తన పరిసరాల్లో తుపాకీ కాల్పులు జరిగాయని, ఐతే ఆయన సురక్షితంగా ఉన్నారని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి బృందం ఈరోజు తెలిపింది. “అధ్యక్షుడు ట్రంప్ తన పరిసరాల్లో తుపాకీ కాల్పులు జరగడంతో క్షేమంగా ఉన్నారు.” అని ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్‌లో కాల్పులు జరిగాయి. ఆయుధంతో పాటు ఆ వ్యక్తిని అధికారులు బంధించినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

తుపాకీ కాల్పుల శబ్దం వినిపించినప్పుడు ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్నారని పలు మీడియా నివేదికలు తెలిపాయి. కాల్పులు జరిగినప్పుడు ట్రంప్‌తో పాటు సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్టివ్ సిబ్బంది రక్షణగా ఉన్నారు. ఐతే ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తక్షణ ఎలాంటి ఇండేషన్లు లేవని తెలుస్తోంది. CNN సైతం ఈ వ్యవహారాన్ని ధ్రువీకరించింది. గోల్ఫ్ క్లబ్‌లో షాట్‌లు ట్రంప్ కోసం ఉద్దేశించినవేనని అధికారులు విశ్వసిస్తున్నారని పేర్కొంది. ట్రంప్ బయలుదేరిన ప్రదేశానికి అత్యంత సమీపంలోని పొదల్లో అధికారులు ఏకే-47 రైఫిల్‌ను కూడా కనుగొన్నారని అమెరికా మాజీ అధ్యక్షుడి కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తెలిపాడు.
“ఇంకోసారి దాడి… ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్‌లో కాల్పులు జరిగాయి. స్థానిక చట్టాన్ని అమలు చేస్తున్న వారి ప్రకారం, పొదల్లో AK-47 కనుగొనబడింది,” అని అతను Xలో పోస్ట్ చేసాడు. నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రాటిక్ ప్రత్యర్థి అయిన ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇద్దరికీ ఈ సంఘటన గురించి వివరించామని వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. “అమెరికాలో రాజకీయ హింసకు, మరే విధమైన హింసకు చోటు లేదు” అని అధ్యక్షుడు జో బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ భద్రతను కట్టిదిట్టం చేయాల్సిందిగా కోరినట్టు ఆయన చెప్పారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు కమలా హ్యారిస్. పెన్సిల్వేనియాలో ట్రంప్ ర్యాలీ సందర్భంగా ముష్కరుడు కాల్పులు జరపడంతో మాజీ అధ్యక్షుడి చెవికి గాయమైన రెండు నెలల తర్వాత ఈ ఘటన జరిగింది. అమెరికా సీక్రెట్ సర్వీస్, అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు ఇతర ప్రముఖులను రక్షించే పనిలో ఉంది. పెన్సిల్వేనియా సంఘటన తర్వాత విమర్శలను ఎదుర్కొంది.

